మంత్రి జగదీశ్‌ రెడ్డి, కోమటి రెడ్డి మధ్య వాగ్వాదం

-

యాదాద్రి భువనాగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజా గోపాల్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి లు వేదిక పైకి రాగానే ఇరు వర్గాల కార్యకర్తలు హోరా హోరీగా నినాదాలు చేశారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించడం లేదని అని కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో ఇరు పార్టీ కార్యకర్తల నినాదాల మధ్య రసాభాసగా మారింది సభ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే కి కనీస సమాచారం లేకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారని మంత్రి జగదీశ్‌ రెడ్డిపై ఫైర్‌ అయ్యారు. మునుగోడు నియోజకవర్గం లో ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం కాదు,సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.

ఉమ్మడి నల్గొండ మంత్రి జగదీష్ రెడ్డి కి చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ తో కొట్లాడి మునుగోడు నిధులు అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిచో తన నియోజకవర్గంలో ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించినా ఇలాగే ఉంటుంది అని సవాల్ విసిరారు. దీంతో నూతన రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news