తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పై చర్చ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీలో ఎతుల వెంక్కటయ్య, నాలుగు బర్రెల కథ చెప్పారు జగదీశ్ రెడ్డి. స్పీకర్ ను ఏకవచనంతో పిలిచినందుకు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. స్పీకర్ ను ప్రశ్నించడాన్ని జగదీశ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని.. ప్రతీ పదం వెనక్కీ తీసుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.
స్పీకర్ కి జగదీశ్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు హరీశ్ రావు జగదీశ్ రెడ్డి తప్పు మాట్లాడలేదని తెలిపారు. సభలో ప్రతిపక్ష నేతలకు సమానమైన హక్కు ఉంటుందని జగదీశ్ రెడ్డి మాట్లాడారు. అందరూ కూర్చొంటే.. సభ ఆర్డర్ లో ఉంటుంది. స్పీకర్ ఆలోచనల ప్రకారం.. అందరూ కూర్చొంటే మాట్లాడుతానని పేర్కొన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నారు. స్పీకర్ కి గౌరవం ఇవ్వాలనే విషయం కూడా తెలియదు. గతంలో సంపత్ కుమార్ పేపర్లు పైకి విసిరేసినందుకే సస్పెండ్ చేశారు. దళితులపై జరిగిన అవమానాన్ని యావత్ తెలంగాణ దళితులు ఖండించాలన్నారు. సభలో గందరగోళం జరగడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.