కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కు ఊహించని పరిణామం ఎదురైంది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్ పై.. కొంత మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి దిగారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ పట్టణంలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఆదివారం మిట్టమధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా… పై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కోడిగుడ్ల దాడి కి నిరసనగా బిజెపి కార్యకర్తలు భువనేశ్వర్ ఎయిర్ పోర్టు ముందు నిరసనకు దిగారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ లోని లికిం పూర్ లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది సామాన్యులు మృతిచెందారు. దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్దఎత్తున నిరసన చేస్తున్నాయి. అలాగే కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రా ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతి పక్షాలు. ఇక ప్రస్తుతం ఈ కేసులో నిందితుడైన ఆశిష్ మిశ్రా జైల్లో ఉన్నాడు.