70 మందితో కాంగ్రెస్ తొలి జాబితా!

-

సోనియా గాంధీ ఆధ్వర్యంలో  జరిగిన కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కొద్ది సేపటిక్రితమే ముగిసింది.  రాజస్థాన్‌, తెలంగాణల్లో అభ్యర్థుల ఎంపిక, రాష్ట్రాల గెలుపు అవకాశాలతో పాటు కీలక అంశాలపై చర్చించినట్టు సమాచారం. మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్ కు సంబంధించిన 70మందితో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రేపు జాబితా విడుదలకు ఉత్తమ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అభ్యర్థుల తుది జాబితాను రూపొందించేందుకు కాంగ్రెస్‌ నేతలతో కుంతియా తన నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం కుంతియా, ఉత్తమ్‌, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులంతా కలిసి మరోసారి భేటీ అయి రాహుల్‌తో చర్చించారు.

జాబితాలో ె ఎవరెవ్వరి ఎన్ని సీట్లు ఇచ్చారనే అంశాన్ని రాహుల్ గాంధీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.  ముఖ్యంగా ఉస్మానియా జేఏసీలకు, రాష్ట్రంలోని బీసీ వర్గాలు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించిన సీట్లపై ఆరా తీశారు. దీంతో 70 మందితో కూడిన పూర్తిస్థాయి జాబితాను మంగళవారం మధ్యాహ్నం ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ రెబెల్స్ తో పార్టీకి కాస్త ఇబ్బందిగా మారనుంది. రెబెల్స్ తో చర్చించి వారి నుంచి ఎలాంటి ఒత్తిడి, పార్టీకి నష్టం లేకుండా చర్యలు చేపడతామని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news