తెదేపా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు…భాజపా నేత

-

తెలంగాణలో గతంలో తెదేపా, కాంగ్రెస్ ను గెలిప్తే మరోసారి ఎమ్మెల్యేలు అమ్ముడుపోక తప్పదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్ రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన పార్టీ బూత్‌కమిటీ సమావేశంలోఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే తమ పార్టీని గెలిపించారలని  ఆయన కోరారు. తెరాస అధినేత గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదని గుర్తుచేశారు. మహా కూటమికి ఓటేస్తే తెలంగాణలో చంద్రగ్రహణం తప్పదన్నారు. ఆయా పార్టీలకు చెందిన వారిని గెలిపిస్తే మరో సారి తెరాసకు అమ్ముడుపోతారని విమర్శించారు.

భాజపా కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని గుర్తు చేశారు. తెరాస ఓటమి సిద్ది పట నుంచే మొదలవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపా అభ్యర్థి నాయిని నరోత్తంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా మోదీ విధానాలకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయడంలో భాజపా పాత్ర కీలకమైందని మురళీధర్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news