CONGRESS: కాశ్మీర్ టూ కన్యాకుమారి వరకు ‘ భారత్ జోడో’ యాత్రం

-

కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే రాజస్తాన్ ఉదయ్ పూర్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్ ’ నిర్వహించింది. మూడు రోజులు పాటు జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకే కుటుంబం- ఒకే టికెట్ విధానాన్ని తీసుకువచ్చింది. ఇకపై కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఇన్నాళ్లు కుటుంబ పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్ దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తోంది. శింతన్ శిబిర్ లో మొత్తం 20 ప్రతిపాదనలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ( సీడబ్య్లూసీ) ఆమోదించింది. 50 ఏళ్లలోపు నాయకులకు పార్టీలో 50 శాతం పదవులు ఇవ్వాలని..పార్టీ పదవుల్లో 5 ఏళ్ల తరువాత 3 ఏళ్లు విరామం… ఇలా కీలక నిర్ణయాలు తీసుకుంది.

తాజాగా ‘కాశ్మీర్ టూ కన్యాకుమారి’ వరకు కాంగ్రెస్ ‘భారత్ జోడో’ యాత్రను చేయాలని చింతన్ శిబిర్ లో ప్రకటించింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం యాత్ర చేస్తున్నామని సోనియాగాంధీ వెల్లడించారు. జూన్ 15 నుంచి 2వ విడత జన్ జాగరణ్ యాత్ర ప్రారంభం అవుతుందని… ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుందని సోనియాగాంధీ వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో ఓ సలహా కమిటీని ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news