లక్ష ఓట్లు.. వంద కోట్లు ? అన్నీ జ‌గ‌న్ వే..! ఎనీ డౌట్స్!

-

ఇవాళ వైఎస్సార్ మ‌త్స్య‌కార భ‌రోసా కు శ్రీ‌కారం దిద్దారు సీఎం జ‌గ‌న్. ఈ ప‌థ‌కం ద్వారా ల‌క్షా ఎనిమిది వేల 755 కుటుంబాల‌కు ల‌బ్ధి చేకూర్చ‌నున్నారు. ఇందుకోసం ఒక్కో కుటుంబానికి ప‌ది వేల రూపాయ‌ల చొప్పున అందించేందుకు, ఇందుకు 109 కోట్ల రూపాయ‌లు విడుద‌ల చేసేందుకు సీఎం సుముఖ‌త వ్య‌క్తం చేస్తూ, సంబంధిత నిధులు విడుద‌ల చేశారు. వేట‌కు దూరంగా ఉన్న వేళ లీన్ మంత్స్ పేరిట సముద్రం పైకి వెళ్ల కుండా వేట నిషేధిత కాలంలో ఆక‌లితో అలమ‌టించ‌కుండా ఉండేందుకు ఈ సాయం ఉప‌యోగ‌ప‌డనుంద‌ని భావిస్తూ..ఇవాళ కోన‌సీమ జిల్లా, ముర‌మ‌ళ్ల గ్రామంలో అధికారికంగా లాంఛ్ చేశారు ఈ ప‌థ‌కాన్ని..!

ఇదంతా బాగుంది ఆ రోజు టీడీపీ హ‌యాంలో ఇచ్చిన మొత్తం క‌న్నా తామే ఎక్కువ ఇస్తున్నామ‌ని కూడా చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఎప్పటి నుంచో అమ‌లులో ఉంది. ఇందుకు టీడీపీలో కూడా కొంత మొత్తాలు కేటాయించారు. అయితే నాడు బాబు స‌ర్కారు ఇచ్చింది నాలుగు వేల వ‌ర‌కూ ఉంది. దానినే ప‌దివేలకు పెంచారు. ఆ విధంగా ల‌క్ష ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తూ, వంద కోట్ల ప‌థ‌కాన్ని షురూ చేశారు ఇవాళ జ‌గ‌న్ ! మ‌రి !ఆ ల‌క్ష ఓట్లు వైసీపీవేనా అంటే ఏమో ! ముందున్న కాల‌మే తేల్చాలిక !

ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చెప్పిన విధంగా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వర‌కు వేట‌కు వెళ్ల‌కుండా నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిషేధిత కాలంలో ఉండే మ‌త్స్యకారుల‌కు ఈ సాయం అంద‌నుంది. బాగుంది మ‌రి! తీర ప్రాంత గ్రామాల‌కు వైసీపీ చేస్తున్న‌దేంటి అన్న ప్ర‌శ్న కూడా ఒక‌టి విప‌క్షం నుంచి వినిపిస్తోంది. అర్హుల‌యిన అంద‌రికీ కాకుండా కొంద‌రికే ఈ ప‌థ‌కం ల‌బ్ధి అందుతుంది అని ఇప్ప‌టికే ఓ స‌ర్వేలో టీడీపీ నిగ్గు తేల్చింద‌ని తెలుస్తోంది. అంటే జ‌గ‌న్ చెప్పిన విధంగా జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది విప‌క్షం ఆరోపణ.
ఈ ఆరోప‌ణలు ఎలా ఉన్నా వైసీపీ లెక్క‌లు వేరుగా ఉన్నాయి. వాటి ప్ర‌కారం చూస్తే ఎవ‌రు లెక్క‌లు ఎటు వెళ్తాయో అన్న‌ది తెలుస్తుంది. ఒక్కసారి అవి కూడా చూద్దాం.

  • మత్స్యకార భృతి 4 వేలు రూపాయలు నాడు
  • ‘వైయస్ఆర్ మత్స్యకార భరోసా’ భృతి 10 వేలు రూపాయలు నేడు
  • చేపల వేటకి వెళ్లి మరణించిన కుటంబానికి 5 లక్షలు రూపాయలు నాడు
  • చేపల వేటకి వెళ్లి మరణించిన కుటంబానికి 10 లక్షలు రూపాయలు నేడు.
  • డీజిల్ ఆయిల్ పై సబ్సిడీ రూ.6.03 పైసల నాడు
  • డీజిల్ ఆయిల్ పై సబ్సిడీ రూ. 9 నేడు
  • మత్స్య పరిశ్రమ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు..
  • పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఏర్పాటు చేస్తున్న
    రాష్ట్రంలో తొలి ఫిషరీస్‌ విశ్వవిద్యాలయంకి
    తొలి విడతగా రూ.100 కోట్లు మంజూరు.
  • యువతకు ఉపాధి, ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంపొందించడమే లక్ష్యంగా శ్రీకాకుళం, పాలకొండ, పలాసలో ఆక్వా హబ్స్ ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు.. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 300 రీటైల్ ఔట్ లెట్స్ ఏర్పాటు..

పైవ‌న్నీ వైసీపీ స‌ర్కారు చెబుతున్న మాట‌లు. వీటిలో కొన్నే నిజాలు ఇంకొన్ని అబ‌ద్ధాలు అని టీడీపీ కౌంట‌ర్ ను దాఖ‌లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news