నేనే ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలిని : సోనియాగాంధీ

ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిడబ్ల్యుసి సమావేశం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసమ్మతి నేతల తీరుపై సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ ఫుల్ టైం కాంగ్రెస్ అధ్యక్షురాలిని అని .. దీనిపై ఎలాంటి అనుమానాలు లేవని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

ఎలాంటి అంశాల పైన చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. పార్టీ వ్యవహారాలపై మీడియా ముందుకు వెళ్లవద్దని హెచ్చరించారు సోనియా గాంధీ. ఈ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా ఈ సీడబ్ల్యూసీ సమావేశం… కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక, వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరియు యూపీ ఘటనపై పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ సమావేశం జరుగనున్నట్లు సమాచారం అందుతోంది.