ఇండియా కోచ్ గా ద్రావిడ్ : పారితోషికం ఎంతంటే ?

టీం ఇండియా కోచ్ గా రాహుల్‌ ద్రావిడ్ గా నియామకం అయ్యారు. 2023 వరల్డ్ కప్ ముగిసే వరకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉండనున్నారు. T-20 వరల్డ్ కప్ ముగిశాక కోచ్ పదవి కి రవిశాస్త్రి రాజీనామా చేసిన అనంతరం రాహుల్‌ ద్రావిడ్ టీం ఇండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జై షా.. స్వయంగా ద్రవిడ్‌తో మాట్లాడి హెడ్ కోచ్‌గా ఉండేందుకు ఒప్పించారు.

గత నాలుగేళ్లలో ద్రవిడ్‌‌ని కోచ్‌గా ఒప్పించేందుకు మూడు సార్లు బీసీసీఐ పెద్దలు ప్రయత్నించారు. అయితే ఈ సారి టీం ఇండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రావిడ్ ఒప్పుకున్నారు. అయితే టీం ఇండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ ద్రవిడ్‌కి ఏకంగా 10 కోట్ల రూపాయల సాలరీని ఆఫర్ చేసింది బీసీసీఐ.

ఇంత భారీ మొత్తం లో హెడ్ కోచ్ కు ఇవ్వడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఎంసీఏ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్… ఆ పదవికి రాజీనామా చేయబోతున్నారు. అలాగే బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ పదవి కాలం కూడా ముగుస్తున్న నేపథ్యంలో అతడి స్థానంలో భారత మాజీ బౌలర్… పరాస్ మాంబ్రే బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.