కారు-కమలం మధ్యలో కాంగ్రెస్..ఓ కుమ్మక్కు కథ?

-

తెలంగాణ రాజకీయాల్లో ఓ వెరైటీ ఫైట్ జరుగుతుంది…అసలు ఎవరు ఎవరితో ఫైట్ చేస్తున్నారో..ఎవరు ఎవరితో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారో ఎవరికి క్లారిటీ లేదని చెప్పొచ్చు. అసలు ప్రతి పార్టీ టార్గెట్ అధికారమే….ఇందులో ఎలాంటి డౌట్ లేదు…మూడోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్…రెండుసార్లు ఓడిపోయి..మూడోసారైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్…తొలిసారి తెలంగాణ గడ్డపై పాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.

ఈ మూడు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి..అయితే ఇక్కడ కాంగ్రెస్-బీజేపీల టార్గెట్ ఒక్కటే..అది టీఆర్ఎస్‌ని గద్దె దించడం..అలాగే టీఆర్ఎస్ టార్గెట్ వచ్చి కాంగ్రెస్-బీజేపీలని అధికారంలోకి రాకుండా చేయడం. కాకపోతే ఇక్కడ ఏ పార్టీ అయినా…రెండు పార్టీలకు చెక్ పెట్టాలి. అందుకే రెండు పార్టీలు కుమ్మక్కు అయిపోయాయని చెబితే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

టీఆర్ఎస్-బీజేపీలు ఒక్కటే అని కాంగ్రెస్ విమర్శిస్తూ ఉంటుంది..అంటే ఆ రెండు పార్టీలు సీక్రెట్‌గా రాజకీయం చేస్తున్నాయని అంటుంది. ఇక టీఆర్ఎస్-కాంగ్రెస్‌లు ఒక్కటే అని బీజేపీ కామెంట్ చేస్తుంది. అలాగే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కుట్ర చేస్తున్నాయని టీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటుంది. ఎలా ఎవరికి వారే కుమ్మక్కు రాజకీయాలంటూ కామెంట్ చేస్తున్నారు. తాజాగా కూడా రాష్ట్రంలో విచిత్రమైన కథలు నడుస్తున్నాయి. ఈ మధ్య కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని కామెంట్ చేసిన విషయం తెలిసిందే…దీనిపై కాంగ్రెస్, బీజేపీలు నిరసనలు తెలియజేశాయి. ఇదే సమయంలో కేసీఆర్…ప్రధాని మోదీని తిట్టడాన్ని కాంగ్రెస్ ఖండించింది.

ఇదిలా ఉంటే తాజాగా మోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడారు…కాంగ్రెస్ దారుణంగా విభజన చేసిందని అన్నారు. దీనిపై టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఫైర్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని మోదీ అవమానించారని టీఆర్ఎస్ మాట్లాడుతుంది. అటు కాంగ్రెస్ సైతం మోదీ వ్యాఖ్యలపై ఫైర్ అవుతుంది. అసలు మోదీ..కాంగ్రెస్‌ని తిడితే టీఆర్ఎస్ ఎందుకు స్పందించిందని బీజేపీ ప్రశ్నిస్తుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాణేనికి చెరొక వైపు అన్న విషయం మరోసారి అర్థమైందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇలా తెలంగాణలో కారు-కమలం-కాంగ్రెస్ పార్టీల కుమ్మక్కు కథ నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news