నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందుకు మాజీ మంత్రి గీతారెడ్డి

-

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించింది. తెలంగాణణ కాంగ్రెస్ నేతలకు కూడా సమన్లు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఒక్కొక్కరూ ఈడీ విచారణకు హాజరు అవుతున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ.. మాజీ మంత్రి గీతారెడ్డి ఈడీ ఎదుట హాజరయ్యారు. అప్పట్లో యంగ్‌ ఇండియా లిమిటెడ్‌కు విరాళాలు ఇచ్చిన వారికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గీతా రెడ్డితోపాటు గాలి అనిల్ కుమార్ నేడు విచారణకు హాజరయ్యారు. ఈ నెల 3న మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఈడీ విచారణ చేసిన సంగతి తెలిసిందే.

నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో తెలంగాణకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ నేతలు ఈడీ నోటీసులు అందుకున్నారు. వారిలో తెలంగాణ నేతలు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, గీతా రెడ్డి, అనిల్ కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news