నల్గొండలో హస్తం జోరు.. కారు బేజారు?

-

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అనే సంగతి తెలిసిందే…అయితే 2014 ఎన్నికల వరకు నల్గొండ కాంగ్రెస్‌కు కంచుకోటగానే ఉంది…కానీ 2018 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. టీఆర్ఎస్ వేవ్‌లో నల్గొండలో కాంగ్రెస్ చావు దెబ్బతింది.. జిల్లాలో ఉన్న 12 సీట్లలో టీఆర్ఎస్ 9 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 3 సీట్లకే పరిమితమైంది..మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్ సీట్లలో గెలిచింది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో…హుజూర్‌నగర్ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది..దీంతో అక్కడ ఉపఎన్నిక రాగా, ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది.

అలాగే నకిరేకల్‌లో గెలిచిన చిరుమర్తి లింగయ్య…టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు…దీంతో నల్గొండలో కాంగ్రెస్‌కు ఒక ఎమ్మెల్యేనే మిగిలారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఉన్నారు..ఈయన కూడా కాంగ్రెస్‌లో ఉండాలా వద్దా? అన్నట్లే ఉన్నారు. అయితే ఇలా నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ హవా నడిచింది. ఇలా టీఆర్ఎస్ హవా ఉన్న నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నిదానంగా పుంజుకుంటుంది.

అక్కడ ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు…పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు…ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా నల్గొండలో కారుకు చెక్ పెట్టడానికి కొత్త ఎత్తులతో ముందుకొస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఈ సారి నల్గొండలో సత్తా చాటాడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్గొండలో కాంగ్రెస్ బలం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది..అందుకు ఉదాహరణగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో అయిన కాంగ్రెస్ సభ్యత్వాలే కనిపిస్తున్నాయి.

తెలంగాణలోనే అత్యధికంగా నల్గొండ పార్లమెంట్ పరిధిలో 4 లక్షల 30 వేల సభ్యత్వాలు అయ్యాయని తాజాగా రేవంత్ రెడ్డి ప్రకటించారు..దేశంలోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పారు. అంటే నల్గొండలో కాంగ్రెస్ బలం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు..అక్కడ నేతలు ఎలా పనిచేస్తున్నారో చూడవచ్చు…ఈ పరిస్తితులని బట్టి చూస్తుంటే నెక్స్ట్ ఎన్నికల్లో నల్గొండలో హస్తం జోరు కొనసాగడం…కారు అడ్రెస్ గల్లంతు అవ్వడం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news