కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్… యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడిన మాజీ కేంద్ర మంత్రి

-

కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. గత కొంత కాలంగా ప్రధాన పార్టీ నాయకులను కోల్పోతూ వస్తున్న ఆ పార్టీకి యూపీ ఎన్నికల ముందు ఊహించని షాక్ ఎదురైంది.  మాజీ కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. సోనియా గాంధీని ఉద్దేశించి ఆయన తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. నేను నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో యూపీఏ హయాంలో సింగ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తూర్పు యూపీలోని కుషినహార్ చెందని ఆర్పీఎన్ సింగ్ కాంగ్రెస్ ముఖ్య  ఒకరుగా ఉన్నారు. జార్ఖండ్ ఇంఛార్జ్ గా కూడా ఆర్పీఎన్ సింగ్ ఉన్నారు.

ఇటీవల బీజేపీని వీడిన మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య స్థానం అయిన పద్రౌనా నుంచి బీజేపీ తరుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆర్పీఎన్ సింగ్ పోటీ చేయవచ్చని తెలుస్తోంది. ఆర్పీఎన్ సింగ్ మూడు పర్యాయాలు పద్రౌనా నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను 2009లో ఎంపీగా ఎన్నికయ్యాడు కానీ 2014లో ఓడిపోయాడు. స్వామి ప్రసాద్ మౌర్య గత రెండు ఎన్నికల్లో పద్రౌనా స్థానం నుంచి మొదట బీఎస్పీ అభ్యర్థిగా తర్వాత పార్టీ మారి బీజేపీ అభ్యర్థిగా గెలుపొందారు. యూపీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన నాయకులు టికెట్లు ఇచ్చినా.. పార్టీలు మారడం తలనొప్పిగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version