ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు కుట్రలు.. మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలనను తీసుకురావడానికి కుట్రలు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి అతిషి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులు సమావేశాలకు హాజరు కావడం మానేశారు. సీఎం ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఢిల్లీలో అధికారులను నియమించడం లేదు, బదిలీలు, పోస్టింగ్ లు లేవు. గత కొన్ని రోజులుగా ఎల్డీ ఎంహెచ్ఎక్  నిరాధారమైన లేఖలు రాస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసినట్లుగా ఉంది. మొత్తంగా ఈ సంకేతాలను చూస్తే ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చి దేశరాజధానిలో రాష్ట్రపతి పాలన తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కుట్రలు చేస్తుంది. ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రపతి పాలన ‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’ అని ఆమె పేర్కొంది.

ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రివాల్, ఆమ్ ఆద్మీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు, బీజేపీ చేస్తున్న ఈ కుట్రలు ఢిల్లీ ప్రజల ఆదేశానికి విరుద్ధంగా ఉన్నాయి. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టాలని కాషాయ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందని ఆమె విలేకరుల సమావేశంలో అన్నారు. ఇటీవల సీఎం అరవింద్ కేజ్రివాల్ ప్రైవేట్ సెక్రటరీ బిభవ్ కుమార్ను విజిలెన్స్ డిపార్ట్ మెంట్ తొలగించిన ఒక రోజు తర్వాత, మంత్రి అతిషి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news