తాండవ్ వెబ్ సిరీస్ వివాదానికి అసలు కారణం ఇదేనా

Join Our Community
follow manalokam on social media

తాండవ్ వెబ్ సిరీస్ తీవ్ర వివాదాలకు దారి తీసింది. అమెజాన్ ప్రైమ్ సంస్థ సరిగ్గా సంక్రాంతి రోజును భారీ మంటల్ని తన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రగిల్చింది..దాంతో ఇప్పుడు దేశంలోని పలు ప్రాంతాలలో హిందుత్వ వాదులు తాండవం చేస్తున్నారు. … ఇది స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటలకే సోషల్ మీడియాలో వేడి సెగలు మొదలయ్యాయి. ఒకటి రెండు రోజులకు అవి దేశ వ్యాప్తంగా ఆందోళనలకు, నిరసనలకు దారి తీశాయి. ఇటు మహారాష్ట్ర నుండి అటు ఉత్తర ప్రదేశ్ వరకూ ప్రధానంగా హిందుత్వ వాదులు ఈ వెబ్ సీరిస్ మీద మండి పడ్డారు… వారిని అంతగా హర్ట్ చేసిన అంశాలు ఇందులో కొన్ని ఉండటమే ఓ కారణం గా తెలుస్తుంది…

తొమ్మిది భాగాల ఈ వెబ్ సీరిస్ తొలి భాగాన్ని మనం చూస్తే… గత కొన్నేళ్ళుగా మన కళ్ళముందు జరుగుతున్న సాంఘీక, రాజకీయ సంఘటనల సమాహారమే ఈ వెబ్ సీరిస్ అనేది అర్థమైపోతోంది..ప్రతి ఎపిసోడ్ షుమారుగా 30 నిమిషాల నిడివి కలిగి ఉంది. దీని కథ విషయానికి వస్తే ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్ రాజధాని ఢిల్లీ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఇక్కడి రాజకీయ రంగంలోని చీకటి కోణాలను, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు ప్రబుద్ధులు..రక్తసంబంధాలను సైతం పట్టించుకోకపోవడం గురించి ఓ పక్క చూపించారు. అలానే చేతికి అందబోతున్న అధికారం ఎక్కడ చేజారిపోతుందో అనే భయంతో ఎత్తులు, జిత్తులు పన్నే మహిళా మణుల గురించి చూపించారు.

కుల రాజకీయాలను పునాదిగా చేసుకుని, పాపులారిటీ సంపాదించడం కోసం ఎలాంటి పని అయిన చేసే విద్యార్థి నాయకులనూ ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. రాజకీయాలకు సంబంధించిన ఎపిసోడ్స్ లో నిజానిజాల సంగతిని పక్కన పెడితే. ఆ వ్యవస్థ తీరుకు తగ్టటుగానే దానిని చూపించారు. కానీ జె.ఎన్.టి.యు. అనే పేరు ఎత్తకుండా… విఎన్టీయూ అనే యూనివర్శిటీలో జరిగినట్టుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అక్కడ ఓ విద్యార్థి నాయకుడు శివుడి పాత్రను వేసి శివతత్త్వాన్ని అవమానిస్తాడు. ఈ రకంగా హిందువుల మనోభావాలను విద్యార్థి నాయకుడి పాత్రధారి చెప్పించడాన్ని అనేకమంది తప్పు పడుతున్నారు. ఇందులో కేవలం హిందూ మతాన్ని కించపరచడమే కాదు అందులోని నిమ్న వర్గాల మనోభావాలూ దెబ్బతీసే అంశాలను చూపించారు.

ఇక బీజేపీ నాయకులు, అటు బీఎస్పీ నేత మాయావతి సైతం ఈ వెబ్ సీరిస్ మీద తమ నిరసన వ్యక్తం చేశారు… పలు ప్రాంతాలలో కేసులూ పెట్టారు. వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ‘తాండవ్’ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. ఎలాంటి దురుద్దేశ్యం తమకు లేదని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించమని కోరాడు. అయితే బీజేపీ, బీఎస్పీ నేతలు మాత్రం ఆ వెబ్ సీరిస్ ను అమెజాన్ ప్రైమ్ నుండి తొలగించాల్సిందే నని పట్టుబడుతున్నారు. నిజానికి ఈ వెబ్ సీరిస్ ఇంత వివాదాలకు తెర తీయడానికి రెండు కారణాలు ఉన్నాయి.

ఇందులో విద్యార్థి నాయకుడు నాటకంలో శివుడిగా నటించి వ్యక్తి జీషాన్ ఆయూబ్ గతంలో తీవ్రవాదులను సపోర్ట్ చేస్తూ కొన్ని స్టేట్ మెంట్స్ ఇచ్చాడు. అతన్ని ఇందులో స్టూడెంట్ లీడర్ కన్హయ్య కుమార్ పాత్రధారి అన్నట్టుగా చూపించారు. అలానే కీలక పాత్రపోషించిన సైఫ్ అలీఖాన్ ఆ మధ్య ‘ఆదిపురుష్’ సినిమా గురించి చెబుతూ, తాను పోషిస్తున్న రావణాసుడి పాత్రను ఓ కొత్త కోణంలో ఆవిష్కరిస్తామని రావణాసురుడిలోని మానవీయ కోణాన్ని చూపించబోతున్నామని అన్నాడు. ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు అది వేరే విషయం కానీ… ఈ ఇద్దరి గత స్టేట్ మెంట్స్ కారణంగా ఈ వివాదం మరో లెవెల్ కు వెళ్ళిందని పిస్తోంది.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...