చలికాలంలో మిమ్మల్ని వేడిగా ఉంచే పానీయాలు ఇవే..

-

చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటే శరీరానికి వేడి కావాల్సి ఉంటుంది. ఐతే మనం తీసుకునే పదార్థాలు మనకి కావాల్సిన వేడిని ఇవ్వడంతో పాటు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని అందించేవి ఐతే బాగుంటుంది. ఈ కరోనా టైమ్ లో రోగ నిరోధక శక్తి ఆవశ్యకత గురించి మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన పనిలేదు. శరీరానికి వేడిని అందించి, ఆరోగ్యాన్నిచ్చే పానీయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గోల్డెన్ మిల్క్:

పసుపుని పాలల్లో కలుపుకుని అందులో దాల్చిన చెక్క, అల్లం, నల్ల మిరియాలు వంటి వేసి, సేవిస్తే ఆరోగ్యానికి మంచిది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి బాగా మేలుచేస్తాయి. జలుబు, జ్వరం వంటి వాతావరణ మార్పుల కారణంగా వచ్చే సమస్యలను ఎదుర్కోవడంలో గోల్డెన్ మిల్క్ బాగా సాయపడుతుంది.

టమాట సూప్:

రుచిగా ఉండడమే కాకుండా విటమిన్లు ఏ, బీ, సి కలిగిన ఈ పానీయం శరీరానికి చాలా మంచిది. విటమిన్లతో పాటు, సోడియం, సల్ఫర్, జింక్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. వేయించిన బ్రెడ్ ముక్కలని టమాట సూప్ లో కలుపుని తాగితే ఆ రుచి బ్రహ్మాండంగా ఉంటుంది.

అల్లం టీ:

అల్లం శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అల్లంతో చేసిన టీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సాధారణంగా టీ తాగని వారు కూడా అల్లంటీ తాగడానికి ఇష్టపడతారు. అంటే అందులో ఉండే విషయం ఏంటో అర్థం చేసుకోవచ్చు. జీర్ణ సమస్యలు ఉన్నవారు అల్లం టీ మంచి ఫలితాలు ఉంటాయి. మరింకే, చలికాలం పూట శరీరానికి కావాల్సిన వేడిని తీసుకోవడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news