తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదనను ధర్మాసనం వినింది. 40 వేల క్యూసెక్కుల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులు ఎత్తిపోసేలా మార్చారన్న పిటిషనర్ గవినోళ్ల శ్రీనివాస్ తరపు న్యాయవాది ధర్మాసనం కి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కమిటీ లోపభూయిష్ఠంగా నివేదిక ఇచ్చిందిన పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్తదేమీ కాదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది వెంకటరమణి తమ వాదనను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు రావలసిన నీళ్లు మాత్రమే తీసుకుంటున్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు తెలిపారు.కేసును తొందరగా ముగించాలని ఆంధ్ర ప్రదేశ్ తరపు న్యాయవాది వెంకటరమణి ధర్మాసనంని కోరారు. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కౌంటర్ అఫిడవిట్ ద్వారా వ్యతిరేకించింది.రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్న తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు.ఈ కేసులో తమ వైఖరేంటో వారం రోజుల్లో తెలియజేయాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేశారు.ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.