సామాన్యులకి రిలీఫ్ కలగనుంది. వంట నూనె ధరలు బాగా పెరిగి పోవడం తో ప్రజలకి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ ఆకాశాన్నంటుతున్నాయి. అదే విధంగా వంట నూనె ధరలు కూడా విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇది నిజంగా సామాన్యులకు భారంగా మారింది అని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..
వంట నూనె ధరలు బాగా పెరిగిపోవడం తో సామాన్యూల నుంచి గత కొన్ని రోజుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీనితో వంట నూనె ధరలు తగ్గించాలని కొన్ని రోజుల నుంచి డిమాండ్ బాగా పెరిగింది.
అయితే ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఊరట కలిగించే ప్రకటన ఒకటి చేసింది.
క్రూడ్ పామ్ ఆయిల్ పైన బేసిక్ కస్టమ్స్ డ్యూటీలో కోత విధించి దానిని 10 శాతానికి కేంద్రం తగ్గించింది. దీంతో రీటైల్ మార్కెట్ లో వంట నూనె ధరలు తగ్గే అవకాశం ఉంది అని తెలుస్తోంది.
సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) దీని మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే రిఫైన్డ్ పామ్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 37.5 శాతానికి దిగి వచ్చింది. ఇలా జరగడం మూలాన వంట నూనె ధరలు దిగిరానున్నాయని సీబీఐసీ వెల్లడించింది. ఇది కనుక జరిగితే సామాన్యులకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది.