ఎక్కువ గంటలు పనిచేయడం గుండెపోటు కి కారణం అవుతుందా? డాక్టర్లు ఏమంటున్నారు?

-

మే 21వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రచురించిన వ్యాసం ప్రకారం ఎక్కువ గంటలు పనిచేయడం గుండెపోటు(Heart Attack) కి, గుండె సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో 2016లో 7,45,000 మంది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. 2000సంవత్సరంతో పోలిస్తే ఇది 29శాతం పెరిగిందని అంటున్నారు.

గుండెపోటు | Heart Attack

మహమ్మారి సమయంలో ఎక్కువ గంటలు పనిచేయడం పెద్ద సమస్యగా మారింది. ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల పనిభారం బాగా పెరిగిందని, ముఖ్యంగా పురుషులపై ఇది ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పశ్చిమ పసిఫిక్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో నివసించే మధ్య వయస్కులు, వృద్ధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పింది. ఇంకా, 45-75సంవత్సరాల వయసు వారిలో 60పైబడ్డ వారు వారానికి 55గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు ఎదుర్కొన్నారాని సర్వేలో వెల్లడైంది.

ఎక్కువ పనిగంటలు గుండె ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయన్న విషయంలో వైద్యులు ఏం చెబుతున్నారంటే,

ఎక్కువ సేపు పనిచేయడం వల్ల ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం చేస్తున్న పనుల్లో మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అదీగాక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయాల్లో పనిచేయడాలు, ఆహార అలవాట్లలో మార్పులు, మొదలైనవి ఈ విధమైన సమస్యలకు దారి తీస్తున్నాయి.

ఇలాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే వైద్యులు చెబుతున్న సూచనలు

ఉప్పు, జంక్ ఫుడ్, తక్కువ ఫైబర్, అధిక కొవ్వులు, ఫాస్టు ఫుడ్ ఆహారాలను ముట్టుకోవద్దు.
క్రమం తప్పని వ్యాయామం
పొగ తాగే అలవాటును తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం.

Read more RELATED
Recommended to you

Latest news