హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ మోహన రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై కాసేపట్లో సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. జగన్ ధాఖలు చేసిన కౌంటర్‌పై ఎంపీ రఘురామ కృష్ణం రాజు తరపు న్యాయవాదులు ఇప్పటికే రీజాయిండర్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల ఏడాది పని తీరును , వారి ట్రాక్ రికార్డ్‌లను రివ్యూ చేసేందుకు రివ్యూ అధారిటీగా సీఎం జగన్ ప్రకటించుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ చర్యలన్నీ జగన్ బెయిల్ ద్వారా లభించిన స్వేచ్ఛను తన కేసుల్లో సాక్ష్యాల్ని రూపుమాపేందుకు, వాడుకుంటున్నట్లు సాక్ష్యుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కాసేపట్లో సీబీఐ కోర్టు ఇరువాదనలు విననుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. విచారణ ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది.