గత 24 గంటల్లో 499 మరణాలు.. 40 కోట్లు మందికి పైగా వ్యాక్సినేషన్..!

కరోనా వైరస్ వలన ఇంకా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఇలా ఉంటే వందల్లో మరణాలు ఇంకా చోటు చేసుకుంటున్నాయి.

గత 24 గంటల కరోనా వైరస్ అప్డేట్స్ గురించి చూసేస్తే… గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 499 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 414108 మంది చనిపోయారు అని తాజాగా విడుదలైన నివేదిక ద్వారా తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే గత 24 గంటల్లో మరో 38660 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30308456 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు అని కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ద్వారా తెలుస్తోంది.

ఇక వ్యాక్సినేషన్ గురించి చూస్తే… ఇప్పటికి 40 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గత 24 గంటల్లో 13,63,123 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటికి మొత్తం 40,64,81,493 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా నుండి ఎంత మంది కోలుకున్నారు అనేది చూస్తే… దేశంలో అలానే ఇంకా 4,21,665 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.