దేశంలో పెరిగిన కేసులు.. మళ్లీ భయం.. భయం

-

న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ కరోనా టెన్షన్ పెరిగింది. ఇప్పటికే ఎన్నో ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతున్నాయి కొంత కాలం స్తబ్ధుగా ఉన్న వైరస్ తాజాగా ఒకరికి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతోంది. దీంతో వైద్యారోగ్య శాఖ అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎంతో నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ బీభత్సం సృష్టిస్తే ఎలాగనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరింతగా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ముమ్మరం చేసేందుకు రెడీ అవుతున్నారు.

తాజాగా కరోనా బులెటిన్‌ను విడుదల చేశారు. గ‌డిచిన 24 గంటల్లో కొత్త‌గా 44,230 పాజిటివ్ కేసులు న‌మోదు అయినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. తాజాగా మొత్తం 555 మంది కరోనా మృతి చెందారు. గురువారం 42 వేల 360 మంది చికిత్స పొంది కోలుకున్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల 15 లక్షల 72 వేల 344 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తాజాగా 4 లక్షల 05 వేల 155 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల 07 లక్షల 43 వేల 972 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మ‌ర‌ణాల సంఖ్య 4 లక్షల 23 వేల 217కు చేరుకుంది. ఇప్పటివరకూ 45 కోట్ల 60 లక్షల మందికి కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు కేంద్రవైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news