హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ప్లాన్ అదేనా…ఈటల రాజేందర్ కు ప్లస్ అవుతుందా?

-

హుజూరాబాద్ ఉపఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఉపఎన్నిక షెడ్యూల్ రాకపోయినా సరే ఇక్కడ గెలవాలని చెప్పి టీఆర్ఎస్, ఈటల వర్గాలు వ్యూహాలు రచించుకుంటూ ముందుకెళుతున్నాయి. అయితే ఇక్కడ బీజేపీకి అంత సీన్ లేకపోవడంతో కాంగ్రెస్ కూడా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

etela-rajender | ఈట‌ల‌ రాజేందర్
etela-rajender | ఈట‌ల‌ రాజేందర్

కేవలం ఈ ఎన్నిక ఈటల సొంత బలం మీద ఆధారపడే జరుగుతుంది. దీంతో కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికని కాస్త లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ గెలవకపోయినా పర్లేదు గానీ, హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్ మాత్రం గెలవకూడదని ఆ పార్టీ శ్రేణులు బలంగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుకే సొంత బలంతో ముందుకెళుతున్న ఈటలకు ఓట్లు పరంగా ఎలాంటి నష్టం జరగకుండా చేయాలని చూస్తున్నారని అంటున్నారు. ఒకవేళ ఇక్కడ బీజేపీనే నిజమైన పోటీ ఇచ్చి ఉంటే అప్పుడు కాంగ్రెస్ కూడా దూకుడుగా ఉండేదని చెబుతున్నారు. అయితే టీఆర్ఎస్‌ని ఓడించాలంటే కాంగ్రెస్ దూకుడుగా ఉంటే అది సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ గనుక ఎక్కువగా ఓట్లు చీలితే అది ఈటలకు నష్టం జరిగి, టీఆర్ఎస్‌కు లాభం జరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

అదే విషయం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతున్నారు. హుజూరాబాద్‌లో ఈటలకే గెలిచే అవకాశాలున్నాయని, దాదాపు 64 శాతం ఓట్లు ఆయనకే వస్తాయని, టీఆర్ఎస్‌కు 30 శాతంపైనే ఓట్లు పడొచ్చని, కాంగ్రెస్‌కు 5 శాతం ఓట్లు వరకు వస్తాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీల్చకుండా చూసుకోవాలని చెబుతున్నారు. అంటే కాంగ్రెస్ ఎక్కువ ఓట్లు చీలితే ఈటలకే నష్టం. అందుకే కాంగ్రెస్ ఇక్కడ దూకుడుగా ఉండటం లేదని తెలుస్తోంది. అలాగే అభ్యర్ధిని ఇంకా డిసైడ్ కూడా చేసుకోవడం లేదు. ఒకవేళ పెట్టిన వీక్‌గా ఉన్న అభ్యర్ధిని పెట్టి, టీఆర్ఎస్‌ని ఓడించడమే కాంగ్రెస్ వ్యూహామని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news