మహమ్మారి వలన ప్రపంచం అంతా అతలాకుతలం అయిపొయింది. కరోనా వైరస్ ఎప్పుడు తగ్గుతుందా అని అంతా చూస్తున్నా.. కరోనా సమస్య ఇంకా తప్పడం లేదు. ప్రతీ రోజు మన దేశంలో వేలల్లో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి సమయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఏది ఏమైనా సోషల్ డిస్టెన్స్ పాటించడం, బయటకు వెళ్తే మాస్క్ ధరించడం లాంటివి తప్పక పాటించడం మంచిది.
ఇక గత 24 గంటల్లో కరోనా వైరస్ కి సంబంధించి అప్డేట్స్ ని చూస్తే.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలై చాలా నెలలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 41,78,51,151 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలుస్తోంది. 22,77,679 మందికి 24 గంటల్లో వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది.
కరోనా కేసులు దేశంలో ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 507 మంది మరణించారు. దీనితో ఇప్పటి వరకు 418987 మంది చనిపోయారు అని తాజా నివేదిక ద్వారా చెబుతోంది.
ఇక రికవరీకి సంబందించిన వివరాలలోకి వెళితే… దేశంలో మరో 38652 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి రికవరీ అవ్వడం జరిగింది. ఇప్పటి వరకూ 30429339 మంది కరోనా నుండి రికవరీ అయ్యారు.ఇంకా 409394 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.