హైదరాబాద్ వచ్చేసిన కరోనా…?

-

ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ హైదరాబాద్ వచ్చేసిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. జలుబు చేసి ముక్కు కారి కాస్త ఒళ్ళు వెచ్చగా ఉంటే చాలు జనం కరోనా వచ్చింది ఏమో అని భయపడిపోతున్నారు. నాలుగేళ్ల క్రితం స్వైన్ ఫ్లూ దెబ్బకు కూడా ఇలాగే భయపడ్డారు జనం. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ లో ఫీవర్ హాస్పిటల్ కి మూడు అనుమానిత కేసులు వచ్చాయి.

హైదరాబాద్ టూ చైనా ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇటీవల జూబ్లీహీల్స్‌ కి చెందిన 25 సంవత్సరాల యువకుడు ఒకరు చైనాకు వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను అనారోగ్యానికి గురై తనకు కరోనా సోకింది ఏమో అని కంగారు పడి నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి శనివారం రాత్రి 11-30గంటల సమయంలో వచ్చాడు. పరీక్షించిన వైద్యులు అనుమానిత కరోనా కేసుగా ఐసోలేటెడ్‌ వార్డులో ఇన్‌పేషంట్‌గా చేర్చి చికిత్స అందిస్తున్నారు.

అదే విధంగా మరో రెండు అనుమానిత కేసులు ఆదివారం మధ్యాహ్నం వచ్చాయి. వీరిని కూడా ఐసోలేటెడ్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.శంకర్‌ మీడియాకు తెలిపారు. వారి ముగ్గురి నుంచి నమూనాలను సేకరించి పూణే ల్యాబ్ కి పంపించామని వైద్యులు మీడియాకు చెప్పారు. దాని గురించి ఎవరూ కంగారు పడవద్దని అనుమానం ఉంటే ఆస్పత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news