కరోనాకు పుట్టిల్లు చైనాను కరోనా కలవరపెడుతోంది. ముందుగా కరోనా చైనాలోని వూహాన్ నగరంలో బయటపడింది. అయితే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు, జీరో కోవిడ్ విధానంతో గత రెండేళ్లుగా పెద్దగా కరోనా కేసులు పెరగకుండా అడ్డుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం చైనాలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. ఏకంగా చైనాలోని పెద్ద నగరాలైన షాంఘై, షెన్జెన్ వంటి నగరాలు లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి.
గత రెండేళ్లలో ఎప్పుడూ లేనంతగా కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి చైనాలో. తాజాగా అత్యధికంగా 16,400 కోత్త కేసులు వెలుగుచూశాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 13 వేల కేసులు ఒక్క షాంఘై నగరం నుంచే నమోదైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. షాంఘైలో తొమ్మిది రోజుల క్రితం లాక్ డౌన్ విధించినప్పటికీ… కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగాయి. వైరస్ తీవ్రత తగ్గేవరకు లాక్ డౌన్ ఆంక్షల కొనసాగుతున్నాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఓమిక్రాన్ బీఏ.2 వేరియంట్ కారణంగా చైనాలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి.