బెంగళూరుతో హైదరాబాద్‌కు పోలికా..అదో పెద్ద జోక్..? కేటీఆర్‌పై కర్నాటక సీఎం సెటైర్‌

-

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. దీనికి ముఖ్యమైన కారణం మంత్రి కేటీఆర్‌. అయితే.. తాజాగా బెంగళూరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలను హైదరాబాద్‌ కు ఆహ్వానిస్తూ.. మంత్రి కేటీఆర్‌.. ట్వీట్‌ చేశారు. అయితే.. కేటీఆర్‌ ట్వీట్‌ పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సీరియస్‌ అయ్యారు.

హైదరాబాద్‌ ను బెంగళూరుతో పేల్చడమేంటని చురకలు అంటించారు ముఖ్యమంత్రి బొమ్మై. ”వ్యాపార, వాణిజ్య రంగ ప్రముఖులు ప్రపంచ నలుమూలల నుంచి బెంగళూరుకు తరలివస్తుంటారు. అతి ఎక్కువ అంకుర, యూనికార్న్‌ సంస్థలు ఉన్న బెంగళూరు అత్యధిక ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

కర్ణాటక రాష్ట్రం గత 3 సంవత్సరాలుగా ఆర్థికంగా ప్రగతి సాధిస్తోంది” అంటూ ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ ను బెంగళూరు తో పేల్చడం పెద్ద జోక్‌ అంటూ ఎద్దేవా చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు. అటు కర్ణాటక బీజేపీ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news