భారత్ తో మళ్లీ పెరిగిన కరోనా.. 24 గంటల్లో 8,822 కొత్త కేసులు

-

భారత్ లో ఫోర్త్ వేవ్ తప్పదా..? అయితే పెరుగుతున్న కేసులను చూస్తే పరిస్థితి ఫోర్త్ వేవ్ కు దారి తీసేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. గతంలో రోజూ వారీ కేసుల సంఖ్య కేవలం 3 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు 7 వేలు, 8 వేలు దాటి కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రల్లో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా మళ్లీ ఇండియాలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్తలో 8822 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 15 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. 5718 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 53,637 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది. ఇండియాలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,26,67,088 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. 5,24,792 మంది మరణించారు. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరోవైపు ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా జోరుగా నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు 195,50,87,271 డోసుల వ్యాక్సినేషన్ అందించారు. గడిచిన 24 గంటల్లో 13,58,607 మందికి టీకాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news