ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తీవ్రత గురించి ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. చైనాలోని ఊహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్ దెబ్బకు ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 600 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 25 వేల మంది వరకు ఈ వైరస్ సోకింది. అసలు ఈ లెక్క నిజమేనా…? చైనా ప్రభుత్వం అధికారిక లెక్కలు ఎంత వరకు నిజం…? ఇప్పుడు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే అసలు చైనా అధికారిక లెక్కలు తప్పు అంటున్నారు. ఒక వెబ్ సైట్ కథనం ప్రకారం చైనా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్తుంది అంటున్నారు. ‘ఎపిడమిక్ సిచ్యువేషన్ ట్రాకర్’ పేరుతో ఆన్‌లైన్ న్యూస్ వెబ్‌సైట్ ‘టెన్‌సెంట్’ సంచలన కథనం రాసింది. కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 1,54,023గా, మృతుల సంఖ్య 24,589గా ఆ ట్రాకర్ పేర్కొనడం ఆందోళన కలిగిస్తుంది.
ధికారిక గణాంకాలకన్నా మృతుల సంఖ్య 80 రెట్లు ఎక్కువ అని అంటున్నారు. అయితే ఆ వెబ్ సైట్ ని చైనా ప్రభుత్వం బెదిరించిన నేపధ్యంలో లెక్కలను మళ్ళీ మార్చింది అంటున్నారు. ఈ నెల ఒకటి నాటికి వైరస్ బారిన పడినవారి సంఖ్యను 14,446 మార్చారు. మృతుల సంఖ్య 304కి మారింది. ఒక్క వూహాన్‌లోనే లక్ష నుంచి 3.5 లక్షల మందికి సోకి ఉండొచ్చని అంతర్జాతీయ లెక్కలు చెప్తున్నాయి.
ఇది గాలి ద్వారా సోకిన వైరస్ అని, ఇది గాలితో పాటుగా అత్యంత వేగంగా విస్తరిస్తుంది అని అంటున్నారు. ఇక దీన్ని త్వరగా మహమ్మారిగా ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీని మరణాలు భారీగా పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికే ఈ వైరస్ తీవ్రతను చైనా అదుపు చేయలేక ఇబ్బందులు పడుతుంది అంటున్నారు. త్వరలో అధికారిక లెక్కల ప్రకారమే వెయ్యి మంది మృతులు అంటూ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.