మనదేశంలో కరోనా కారణంగా ఇప్పటికే 65,469 మరణించారు. ప్రపంచంలో మరణాల సంఖ్య 8లక్షలకి పైమాటే. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంకా ఎంతమంది కరోనా కాటుకి బలవుతారో భయంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్కు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కుంటూ ఉండడం. దూరప్రయాణాలని వాయిదా వేసుకోవడం మొదలగునవి కరోనాని రాకుండా చేస్తాయి.
ఐతే ఈ సూత్రాలన్నీ పాటిస్తే కరోనా చావులు చాలా వరకు తగ్గుతాయట. తాజా నివేదిక ప్రకారం కరోనా జాగ్రత్తలన్నీ పాటిస్తే దాదాపుగా 2లక్షల చావులని ఆపొచ్చట. డిసెంబరు నాటికి 2లక్షల మందిని కరోనా బారినుండి కాపాడవచ్చట. అంటే మాస్కు, భౌతిక దూరం ఎంతమేలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిర్లక్ష్యంగా మనకేం కాదులే అనుకుంటూ ఉండడమే ప్రమాదమని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. ఇలాంటి వాటిని పెడచెవిన పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉంటే అందరికీ మంచిది.