ఏపీ లో భారీగా త‌గ్గిన క‌రోనా.. నేడు 4,198 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి భారీగా త‌గ్గింది. గతంలో ప్ర‌తి రోజు 13 వేలకు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతుండగా.. ప్ర‌స్తుతం కేవ‌లం 4 వేల కేసులు మాత్ర‌మే వెలుగు చూస్తున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 30,886 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా.. 4,198 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నేటి వ‌ర‌కు రాష్ట్రంలో 2297369 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే క‌రోనా మ‌ర‌ణాలు కూడా భారీగానే తగ్గాయి.

గ‌తంలో ప్ర‌తి రోజు 10 నుంచి 12 క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు అవుతుండగా.. గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా 5 గురు క‌రోనా మ‌హమ్మారి వ‌ల్ల మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 14,646 మంది క‌రోనా కాటుకు బ‌లైయ్యారు. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 9,317 మంది క‌రోనా మహ‌మ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 88,364 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే క‌రోనా కేసులు త‌గ్గినా.. వ్యాప్తి మాత్రం రాష్ట్రంలో త‌గ్గ‌లేద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news