జీహెఛ్ఎంసీ మేయర్ ఎన్నికకు రంగం సిద్దమైందా ?

-

గ్రేటర్‌ నూతన పాలకమండలి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సభ్యుల పేర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం గెజిట్‌ ప్రకటించింది. ప్రస్తుత పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఫిబ్రవరి 11న మేయర్ ఎన్నిక జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైంది.

GHMC elections 2020 live updates – manalokam.com

డిసెంబర్ లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-56,బీజేపీ-48,ఎంఐఎం-44,కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో మేయర్‌ ఎవరన్న దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి మేయర్‌ పీఠం దక్కించుకుంటాయా, లేక వ్యూహాత్మకంగా వ్యవహరించి అధికార పార్టీ బల్దియా పీఠంపై తమ జెండా ఎగరేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గెజిట్‌ విడుదల కావడంతో.. నెల రోజుల్లోపు గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తారు. అదే సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది.

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికల్లో కార్పొరేటర్లతోపాటు, ఎక్స్‌అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు. దీనిప్రకారం హాజరైన మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది మద్దతు ఉన్నపార్టీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకుంటుంది. కానీ, తాజాగా వెలువడిన గ్రేటర్‌ ఫలితాల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పదవుల ఎన్నికపై చర్చ కొనసాగుతున్నది. వాస్తవంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక నిబంధనలను పొందుపర్చారు.

కొత్తపాలకవర్గం కొలువుదీరడానికి ముందుగా హైదరాబాద్‌ కలెక్టర్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించి.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. ఈ క్రమంలోనే ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకొనేందుకు అవకాశమిస్తూ రిటర్నింగ్‌ అధికారి మరో నోటిఫికేషన్‌ మరో నోటిఫికేషన్‌ ఇస్తారు. గ్రేటర్‌ పరిధిలో ఓటుహక్కు ఉండి, ఇతర ఏ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గతంలో ఓటుహక్కును వినియోగించుకోని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం 150 మంది కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియోలతో కలిపి మేయర్‌ ఎన్నిక కోసం ఓటర్ల జాబితాను రూపొందిస్తారు.

మొత్తం కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల్లో కనీసం సగం మంది కోరం ఉంటేనే సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సమావేశంలో కార్పొరేటర్లుగా గెలిచినవారు ప్రమాణ స్వీకారం చేశాక ఎన్నిక ప్రక్రియను మొదలుపెడతారు. ఉదాహరణకు ఎక్స్‌అఫీషియోలు, కార్పొరేటర్లు కలిపి 200 మంది ఉంటే.. కనీసంగా వందమంది హాజరైతేనే ప్రత్యేక అధికారి సమావేశాన్ని నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news