ఇండియా స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు… కొత్తగా 3205 కేసులు నమోదు.

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయాలు ఇంకా పోలేదు. తన రూపాన్ని మార్చుకుంటూ… ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లగా ప్రజలపై దాడులు చేస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఇండియాలో 5 వేలకు దిగువనే కేసులు నమోదు అవుతున్నాయి. కొన్ని రోజుల వరకు కేవలం రెండు వేల లోపే ఉన్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. 

కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇండియాలో 24 గంటల్లో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. 31 మంది కరోనా బారిన పడి మరణించారు. 24 గంటల్లో కరోనా నుంచి 2802 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఇండియాలో కరోనా యాక్టివ్ కేసులు 19,509గా ఉన్నాయి. ఇండియాలో కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,23,920 మంది మహమ్మారి బారిన పడి మరణించారు. మొత్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4,25,44,689 గా ఉంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 4,79,208 డోసుల కరోనా వ్యాక్సినేషన్ అందించారు. మొత్తంగా ఇండిాయాలో అర్హులైన వారికి 189,48,01,203 డోసుల వ్యాక్సిన్ అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news