ఎప్పుడు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనాని భరిస్తున్నట్టే.. ఏపీ ప్రభుత్వాన్ని భరించాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం పై తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజా గా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన దైన శైలిలో ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఒక ఇద్దరు పెద్ద హీరోలపై కక్ష సాధించడానికి ఇలా చేస్తుందని విమర్శించారు.
అయితే ఆ ఇద్దరు హీరోలకు రూ. 10 కోట్లు నష్టం వస్తే వారి జీవితంలో ఎలాంటి మార్పు ఉండదని అన్నారు. కానీ చిన్న చిన్న హీరోలకు కోలుకోని దెబ్బ పడుతుందని అన్నారు. అలాగే ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలను కూడా రామ్ గోపాల్ వర్మ తప్పుబట్టారు. హీరోల రెమ్యూనరేషన్ కూడా నిర్మాణం ఖర్చులలో ఉంటుందని అన్నారు. నష్ట పోవాలని ఎవరూ కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీయరని అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం కరోనా వంటిది అని ఆరోపించారు. కరోనాను అయిన వదిలించుకుంటామని కానీ ఏపీ ప్రభుత్వాన్ని వదులు కోలేమని విమర్శించారు. కరోనాని భరిస్తున్నట్టే ఏపీ ప్రభుత్వాన్ని భరించాలని ఘాటాగా స్పందించారు.