న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మరోసారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. గత రెండు రోజులు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారంతో పోలిస్తే గురువారం కరోనా పాజిటివ్ కేసులు 5 శాతం ఎక్కువయ్యాయి. గత 24 గంటల్లో 45 వేల 892 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. నిన్న ఒక్క రోజే 817 మంది మృతి చెందినట్లు బులెటిన్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా 44 వేల 291 మంది రికవరీ అయినట్లు తెలిపింది.
ఇప్పటివరకు మొత్తం మూడు కోట్ల మందికి పైగా కరోనా సోకినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. మృతుల సంఖ్య 4 లక్షల 5 వేల 28గా నమోదు అయినట్లు స్పష్టం చేసింది. గత 24 గంటల్లో 33 లక్షలు 81 వేల 671 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. ఇప్పటివరకూ మొత్తం 36 కోట్ల 48 లక్షల మంది టీకా తీసుకున్నట్లు వైద్యారోగ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వైద్యులు తెలిపారు.