ప్రభుత్వం మరో కొత్త సేవతో ముందుకు వచ్చింది, కరోనా మహమ్మారి లేదా ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితుల్లోనైనా అకస్మాత్తుగా డబ్బు అవసరం ఉంటే అది బాగా ఉపయోగ పడుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్)EPFO సభ్యులుకి అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అయితే వెంటనే తమ పిఎఫ్ బ్యాలెన్స్ నుండి రూ .1 లక్ష అడ్వాన్స్ తీసుకోవచ్చు.
జూన్ 1 న, ఇపిఎఫ్ఓ ఒక సర్క్యులర్ ని విడుదల చేసింది. దీనిలో కరోనా వైరస్ తో సహా ఏదైనా ప్రాణాంతక వ్యాధి చికిత్సకు అకస్మాత్తుగా ఆసుపత్రిలో చేరినట్లయితే రూ .1 లక్షల మెడికల్ అడ్వాన్స్ ఇస్తారని తెలుస్తోంది. ఇంతకు ముందు అయితే మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఇపిఎఫ్ ఖాతా నుండి ఇపిఎఫ్ఓ అడ్వాన్స్ తీసుకోవడానికి అనుమతించింది.
కానీ ఇది అలా కాదు. ఇపిఎఫ్ సభ్యుడు ఎటువంటి బిల్లు లేదా అంచనా వ్యయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకోండి మరియు ఆ మొత్తం ఖాతాకు ట్రాన్సాక్షన్ చేయబడుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఇపిఎఫ్ సభ్యులు ఈ అడ్వాన్స్ ఎలా తీసుకోవచ్చో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. వాటి గురించి చూస్తే…
పేషంట్ చికిత్స కోసం ప్రభుత్వ / ప్రభుత్వ రంగ యూనిట్ / సిజిహెచ్ఎస్ ప్యానెల్ ఆసుపత్రిలో చేర్చాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లయితే, అప్పుడు ఒక అధికారి ఇన్వెస్టిగేట్ చేస్తారు మరియు మెడికల్ అడ్వాన్స్ ని జారీ చేయడం జరుగుతుంది.
ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులెవరైనా ఆసుపత్రి మరియు రోగి వివరాలను తెలియజేస్తూ ఒక దరఖాస్తును ఇవ్వాల్సి ఉంటుంది, ఖర్చు అంచనా లేదు అని తెలపాలి.
ఆసుపత్రిలో చేరడానికి సహాయం కోసం సభ్యుడు లేదా అతని కుటుంబ సభ్యుల నుండి దరఖాస్తు చేసిన ఒక గంటలోపు ఈ మొత్తాన్ని ఇస్తారు.
ఇలా మీరు మొత్తం ఫండ్‌లో 75% పొందవచ్చు మరియు అది తిరిగి చెల్లించబడదు.