దేశంలో 3 కోట్లు దాటిన కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మూడు కోట్లు దాటాయి. ఇప్పటివరకూ 3 కోట్ల 28 వేల 709 మందికి కరోనా సోకింది. మొత్తం 3 లక్షల 90 వేల 660 మంది మృతి చెందారు. ఇప్పటివరకు 2 కోట్ల 89 లక్షల 94 వేల 855 మంది బాధితులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. ఇప్పటి వరకూ దేశంలో 29 కోట్ల మందికి పైగా కరోనా తొలి వ్యాక్సిన్ డోస్ ఇచ్చారు. మంగళవారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 54 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చి కొత్త రికార్డు సృష్టించారు.

ఇక గడ‌చిన‌ 24 గంటల్లో దేశంలో కొత్తగా 50 వేల 848 మందికి క‌రోనా సోకింది. తాజాగా 6 లక్షల 43 వేల 194 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి రేటు కూడా 96.56 శాతానికి పెరిగింది. అదే సమయంలో రోజువారీ క‌రోనా వ్యాప్తి రేటు 2.67 శాతానికి పడిపోయింది. వరుసగా 16 వ రోజు రోజువారీ క‌రోనా వ్యాప్తి రేటు 5 శాతానికి తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.