ఒక తప్పుడు ప్రచారం, ఎందరో జీవితాలను నాశనం చేసింది…!

-

చికెన్ తింటే కరోనా వస్తుంది అంటూ చేసిన ఒక ప్రచారం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అంత ఉష్ణోగ్రత లో ఉడికే చికెన్ కి కరోనా కి సంబంధం ఏంటో ఎవరికి అర్ధం కాలేదు. కరోనా దెబ్బకు కోళ్ళు చనిపోతున్నాయని మనుషులు తింటే మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉందనే ప్రచారం గత కొన్ని రోజులుగా ఎక్కువగా జరుగుతుంది. వాదనలో పస లేకపోయినా సరే కొందరు తప్పుడు ప్రచారం ఎక్కువగా చేస్తూ వచ్చారు.

తెలంగాణా లో పౌల్ట్రీ రంగం ఎక్కువగా ఉంది. ఇక్కడ వేలాది మంది రైతులు దాని మీదే బ్రతుకుతున్నారు. ఎన్నో కుటుంబాలు పౌల్ట్రీ రంగం మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధార పడుతున్నాయి. మొక్క జొన్న సహా అనేక పంటలకు ఆ రంగం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. సరే చికెన్ తింటే కరోనా వస్తుంది. తినే వాళ్ళల్లో ఎవరూ ఎందుకు ఆస్పత్రులకు వెళ్ళలేదు. మిడి మిడి జ్ఞానం తో చేసే ప్రచారాలు జీవితాలను నాశనం చేస్తాయి.

ఈ తప్పుడు పచారం తో ఎందరో జీవితాలు నాశనం అయిపోయాయి. ఎందరో రోడ్డున పడ్డారు. మొక్క జొన్న రైతుల బ్రతుకు ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎవడికి తోచిన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనితో చికెన్ ధర కేజీ 40 రూపాయలకు పడిపోయింది. కోడి ధర 20 రూపాయలకు పడిపోయింది. ఎందరో చికెన్ షాపు యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి.

Read more RELATED
Recommended to you

Latest news