తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. తాజాగా.. మంగళవారం నాడు కొత్తగా 1,524 కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది మరణించారు. అలాగే ఇవాళ 1,161 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. వీరిలో కరోనా నుంచి 24,840 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 375 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 12,531 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
అలాగే ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు నమోదు కాగా, 43 మంది మరణించినట్టు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలో ఒకే రోజులో ఇంత మంది చనిపోవడం ఇదే తొలిసారి. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,019కి చేరింది. వీరిలో కరోనా నుంచి 17,467 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 408 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 15,144 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.