మరోమారు ప్రపంచం కరోనా ముప్పు ముందర నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ముఖ్యం యూఎస్ఏ, యూకే లో పరిస్థితి తీవ్రంగా ఉంది. రోజుకు లక్షలపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఇండియాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పాటు ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేయికి చేరవైంది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా మళ్లీ కరోనా సోకడం ప్రజల్ని కలవరానికి గురిచేస్తోంది.
ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా కరోనా అటాక్ అవుతోంది. బ్రెక్ త్రూ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. తాజాగా ఓ మహిళ నాలుగు సార్లు టీకాలను తీసుకున్నా, కరోనా మళ్లీ సోకింది. సదరు మహిళ వివిధ దేశాల్లో ఇప్పటికే నాలుగు సార్లు వ్యాక్సిన్ తీసుకుంది. ఇటీవల దుబాయ్ నుంచి 12 రోజుల క్రితం మధ్యప్రదేశ్ కు వచ్చిన 30 ఏళ్ల మహిళ.. మళ్లీ ఆదేశానికి వెళ్లేందుకు సిద్ధం అయింది. అయితే వెళ్లే క్రమంలో ఇండోర్ ఎయిర్ పోర్టులో మళ్లీ పరీక్షలు చేయగా… ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. అయితే అంతకుముందు చేసిన కరోెనా పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ గా వచ్చింది. ప్రస్తుతం సదరు మహిళ హస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేవని మధ్యప్రదేశ్ ఇండోర్ CMHO డాక్టర్ భూరే సింగ్ సెటియా వెల్లడించారు.