కరోనా వ్యాక్సిన్ ముందుగా ఎవరికి ఇస్తారంటే..?

-

కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్న వేల వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. భారత దేశంలో రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ కొత్తగా వచ్చే కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పిన దాని ప్రకారం 2021లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని తెలిపాడు. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ తో పాటు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న వ్యాక్సిన్ ప్రయోగాలు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. ఐతే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ముందుగా ఎవరికి వేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఈ విషయమై ఆరోగ్య మంత్రి చెప్పిన ప్రకారం ప్రయారిటీ ఆధారంగా ఎవరికి వేయాలన్నది నిర్ణయిస్తారట. ముఖ్యంగా ఆరోగ్య శ్రామికులు, నర్సులు, డాక్టర్లు మొదలగు వారికి కరోనా వ్యాక్సిన్ ముందుగా వేస్తారట. కరోనాపై పోరాడుతున్న భారతదేశాన్ని ముందుండి నడిపిస్తుంది ఆరోగ్య కార్మికులే కాబట్టి వ్యాక్సిన్ ముందుగా వారికే వేస్తారట. ఆ తర్వాత ప్రయారిటీ ఆధారంగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని సమాచారం

Read more RELATED
Recommended to you

Latest news