కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం వల్ల సుమారు 14 నుంచి 29 లక్షల కేసులు, 37 నుంచి 75 వేల మరణాలు తగ్గించామని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలిపింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. నాలుగు నెలల వ్యవధిలో వైద్య రంగంలో చాలా విజయాలు సాధించామని అన్నారు.
అదనపు ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడానికి అదే విధంగా మానవ వనరులను పెంపొందించడానికి అలాగే భారతదేశంలో పిపిఈలు, ఎన్ 95 మాస్క్‌లు మరియు వెంటిలేటర్లు వంటి క్లిష్టమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించామని అన్నారు. లాక్డౌన్ అనేది… కోవిడ్ -19 వ్యాప్తిని 20-25 శాతం తగ్గించడానికి మాత్రమే సహాయపడుతుందని అంచనా వేశామని అన్నారు.