ముక్కు ద్వారా మెదడులోకి వెళ్తున్న కరోనా వైరస్

-

కరోనా వైరస్ ముక్కు ద్వారా మానవ మెదడులోకి ప్రవేశించవచ్చని ఒక సంచలన అధ్యయనం చెప్పింది. సోమవారం దీన్ని ప్రచురించారు. కరోనా రోగులలో గమనించిన కొన్ని నాడీ లక్షణాలను వివరించడానికి ఇది సహాయ పడింది. జర్మనీలోని చరైట్-యూనివర్సిటాట్స్మెడిజిన్ బెర్లిన్ పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం నేచర్ న్యూరోసైన్స్ పత్రికలో ప్రచురించారు.

కరోనా వైరస్ శ్వాసకోశాన్ని ప్రభావితం చేయడమే కాకుండా, కేంద్ర నాడీ వ్యవస్థ ను కూడా ప్రభావితం చేస్తుంది అని వెల్లడించారు. ఇది చివరికి వాసన కోల్పోవడం, రుచి, తలనొప్పి, అలసట మరియు వికారం వంటి నాడీ సంబంధిత లక్షణాలకు దారితీస్తుంది. శ్వాస తీసుకునే మార్గాన్ని బలంగా ప్రభావితం చేస్తుంది అని వెల్లడించారు. ఫలితంగా వాసన మరియు రుచి కోల్పోవడం, తలనొప్పి, అలసట, వికారం మరియు వాంతులు వంటి నరాల లక్షణాలు మూడింట ఒక వంతు మందికి పైగా ఉంటాయని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news