శేరిలింగంపల్లిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. స్థానిక యూపీహెచ్సీలో శనివారం నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 14 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మెడికల్ ఆఫీసర్ రాంరెడ్డి తెలిపారు. శేరిలింగంపల్లి యూపీహెచ్సీలో 201 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా 14 పాజిటివ్ రాగా, రాయదుర్గం యూపీహెచ్సీలో 85 మందికి పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.