వీటిని వేడి చేసుకుని తింటున్నారా..? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..!

-

చాలా మంది ఇళ్లల్లో వండిన ఆహారాన్ని మిగిలిపోతే స్టోర్ చేసుకుని మళ్లీ ఈ ఆహారపదార్థాలని వేడి చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని చాలా మందికి తెలియదు. వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుని తినడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అయితే ఏ ఆహార పదార్థాలను తిరిగి మళ్లీ వేడి చేసి తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని కనుక చూసారు అంటే మీరు ఈ తప్పులు చేయకుండా ఉంటారు. దానితో అనారోగ్య సమస్యలు కూడా రావు.

గుడ్లు:

గుడ్లలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. కంటికి, జుట్టుకి చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే ఒకసారి వండిన గుడ్లని మరొకసారి వేడి చేసుకుని తీసుకోవడం వల్ల దానిలో ఉండే ప్రోటీన్స్ పోతాయి. అందులో ఉండే నైట్రోజన్ బయటకి వచ్చేసి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుంది. కనుక ఈ తప్పులు అస్సలు రిపీట్ చేయొద్దు.

పుట్టగొడుగులు:

పుట్టగొడుగులు చాలా రుచిగా ఉంటాయి. పైగా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి వండిన పుట్టగొడుగులుని మరొకసారి వేడి చేశారంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా అజీర్తి సమస్యలు, గుండె సమస్యలు కలుగుతాయి. కనుక ఈ తప్పులు అస్సలు రిపీట్ చేయొద్దు.

నూనె:

చాలామంది ఇళ్లలో ఎక్కువగా చేసే పొరపాటు ఇదే. ఒకసారి వాడిన నూనెను మరొకసారి అసలు వాడొద్దు. మళ్లీ మళ్లీ అదే నూనె ఉపయోగించడం వల్ల హృదయ సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. కనుక వీలైనంత వరకు వాడిన నూనెను కూడా అవాయిడ్ చేయడం మంచిది.

బంగాళదుంపలు:

బంగాళదుంప కూర లేదా ఏదైనా మిగిలిపోతే మరొకసారి వేడి చేసుకుని తినద్దు. అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల ఇబ్బందులు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలు ఎన్నో సమస్యలకు ఇది దారి తీస్తుంది. అందుకని దీనిని కూడా మళ్ళీ వేడి చేయొద్దు.

చికెన్:

చికెన్ లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి చాలామంది మరొకసారి చికెన్ ని వేడి చేసుకొని తింటుంటారు. ఇలా చేయడం వల్ల అజీర్తి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news