కోవిడ్‌ 19 టాప్‌ 10 అప్‌డేట్స్ (12-09-2020)

-

కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో శ‌నివారం (12-09-2020) వచ్చిన తాజా అప్‌డేట్లు, ఇతర ముఖ్యమైన వివరాలు..

covid 19 top 10 updates on 12th september 2020

1. ఏపీలో కొత్త‌గా 9,901 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5,57,587కు చేరుకుంది. 95,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,57,008 మంది కోలుకున్నారు. 4,846 మంది చ‌నిపోయారు.

2. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావుకు కరోనా నెగెటివ్ అని నిర్దార‌ణ అయింది. ఇటీవ‌ల ఆయ‌న కోవిడ్ బారిన ప‌డ‌గా హోం ఐసొలేష‌న్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు శ‌నివారం క‌రోనా టెస్టు చేయ‌గా అందులో నెగెటివ్ అని వ‌చ్చింది.

3. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ఇప్పుడ‌ప్పుడే త‌గ్గ‌ద‌ని, అందుకు ఇంకో ఏడాది ప‌డుతుంద‌ని అమెరికాకు చెందిన ప్ర‌ముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న తాజాగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

4. దేశంలో కొత్త‌గా 97,570 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 46,59,985కు చేరుకుంది. 36,24,197 మంది కోలుకున్నారు. 9,58,316 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 77,472 మంది చ‌నిపోయారు.

5. తెలంగాణ‌లో కొత్త‌గా 2,278 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,54,880కి చేరుకుంది. 950 మంది చ‌నిపోయారు. 1,21,925 మంది కోలుకున్నారు. 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

6. బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ కోవిడ్ వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌ను మ‌ళ్లీ ప్రారంభించింది. ఇటీవ‌లే వ్యాక్సిన్ తీసుకున్న ఓ వ్య‌క్తికి తీవ్ర‌మైన అనారోగ్యం సంభ‌వించ‌గా, ట్ర‌య‌ల్స్‌ను ఆపేశారు. ఈ క్ర‌మంలో తాజాగా ట్ర‌య‌ల్స్ ను మ‌ళ్లీ మొద‌లు పెట్టారు.

7. ఢిల్లీలో కొత్త‌గా 4,715 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,14,000కు చేరుకుంది. 1,81,295 మంది కోలుకున్నారు.

8. క‌ర్ణాట‌క‌లో కొత్త‌గా 9,140 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,49,551కు చేరుకుంది. 3,44,556 మంది కోలుకున్నారు. 97,815 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

9. దేశంలో ఇప్ప‌టికే 40 శాతం మందికి కరోనా సోకింద‌ని ఐసీఎంఆర్ తెలిపింది. తాజాగా చేప‌ట్టిన సెరో స‌ర్వే ఆధారంగా ఐసీఎంఆర్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

10. త‌మిళ‌నాడులో కొత్త‌గా 6,227 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,41,649కి చేరుకుంది. 47,110 మంది చికిత్స పొందుతున్నారు. 8,307 మంది చ‌నిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news