ఈటల రాజేందర్‌ కాదు… రాబందు రాజేందర్‌ ; గాదరి కిషోర్

-

ఈటల రాజేందర్‌ పేరు అది కాదని.. దళిత బంధు ఆపేసిన రాబందు రాజేందర్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ… బిజెపి అబద్ద ప్రచారాలు చేస్తుందని… ఈటెల రాజేందర్ బిజెపి కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని చురకలు అంటించారు. గోల్గొండ రిసార్ట్స్ లో మాట్లాడుకుని 50 కోట్లకు డీల్ చేసుకున్నారని… కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి అందుకే పెట్టిందని ఆరోపించారు.

బిజెపి గెలిపించేందు కు రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని… టీఆర్‌ఎస్‌ ప్లినరీ మీటింగ్ లో తెలుగు తల్లి ఫోటో పెట్టినట్లు అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ తల్లి తెలుగుతల్లికే తల్లి అని తమకు అవగాహన ఉందని… రేవంత్ రెడ్డి తిరుగుతున్న కారు కర్నూల్ కాంట్రాక్టర్ ఇచ్చిన కారు కాదా ? అని ప్రశ్నించారు.

దళిత బంధు ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన రాబందు రాజేందర్ అని నిప్పులు చెరిగారు. ఇక్కడ మీటింగ్ పెట్టడానికి బిజెపి వాళ్ళు బయటపడుతున్నారని…. వేల సంఖ్యలో బిజెపి ప్రచారాలు చేస్తుంటే మేము ప్రచారం చేయకుండా అడ్డుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొడితే మాతాలను రెచ్చగొడితే ఓట్లు వస్తాయనుకుంటున్నారా… పోలీసులను కొట్టండి అనేలా బిజెపి వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news