కోవిడ్ అప్డేట్ : నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగిన కేసులు

-

ఇండియాలో కోవిడ్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన నెల కాలంగా కేసుల సంఖ్య 20 వేల కన్నా తక్కువగానే ఉంటోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమం వేగం కావడంతో కొత్త ఇన్ ఫెక్షన్ల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 12,885 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 15054 మంది కోలుకున్నారు. 461 మరణాలు సంభవించాయి. దేశంలో ఇప్పటి వరకు 98.22 రికవరీ రేటుతో 3,37,12,794 మంది కోలుకున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3,43,21,025 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 1,48,579 గా ఉంది.

అంతకు ముందు రోజు దేశంలో 11903 కేసులు నమోదయ్యాయి. అయితే గడిచిన 24 గంటల్లో మాత్రం స్వల్పంగా కేసుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం దీపావళి పండగ సీజన్ కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం కలవరపడుతోంది. పండగ సందర్భంగా భౌతిక దూరం, మాస్క్ లను తప్పనిసరిగా వాడాలని హెచ్చిరిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,07,63,14,440 డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news