అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు…! ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రధాన మోదీ కీలక ఆదేశాలు

-

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. తాజాగా కొత్త వేరియంట్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో మళ్లీ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఆ ఉత్తర్వులను సమీక్షించాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు.

దాదాపు 2 గంటల పాటు కొనసాగిన కోవిడ్ పరిస్థితిపై ప్రభుత్వ అధికారులతో మోదీ సమావేశమయ్యారు. ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’ ఓమిక్రాన్‌తో పాటు దాని లక్షణాలు, వివిధ దేశాలలో దాని ప్రభావం గురించి అధికారులు ప్రధానికి వివరించారు. కొత్త వేరియంట్ ముప్పు దృష్ట్యా, ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని మరియు మాస్కింగ్, బౌతిక దూరం వంటి సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అధికారులకు సూచించారు.

అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించాలని.. హై రిస్క్ ఉన్న దేశాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం గురించి సమావేశంలో చర్చించారు. రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై అధికారులకు ప్రధాని దిశా నిర్ధేశం చేశారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చే అన్ని విమానాలను రద్దు చేయాలని ప్రధానిని కోరారు. మరోవైపు గుజరాత్, ముంబై నగరాలు ఒమిక్రాన్ ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news