యూకే ప్రయాణికులకు భారత్ షాక్..

-

యూకే దేశాల ప్రయాణికులకు ఇండియా షాక్ ఇచ్చింది. బ్రిటన్,  దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కఠిన ఆంక్షలు విధించబోతోంది. కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాలు వేరే దేశాల ప్రజలపై కఠిన ఆంక్షలు తీసుకుంటున్నాయి. దీంట్లో భాగంగానే ఇండియాకు వచ్చే యూకే ప్రయాణికులపై ఈనెల 4 నుంచి ఆంక్షలు అమలులోకి రాబోతున్నాయి. యూకే నుంచి ఇండియా వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72 గంటల ముందు తప్పనిసరిగా కోవిడ్ 19 RTPCR టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. అలాగే ఇండియాకు వచ్చిన 8 రోజుల తర్వాత మరోసారి RTPCR టెస్ట్ చేయించుకోవడాన్ని తప్పని సరిచేసింది. కోవిడ్ టీకా వేయించుకున్నా తప్పని సరిగా 10 రోజుల క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ. ఈ నిబంధనలు ఎన్ఆర్ఐలకు ప్రభావం చూపవని కానీ PIO, OCI కార్డు హోల్డర్లు తప్పకుండా ఈనిబంధనలను పాటించాల్సిందే. ప్రస్తుతం యూకే కూడా భారత పౌరుల విషయంలో ఇలాంటి నిబంధనలనే వర్తింపచేస్తుంది. భారత్ నుంచి యూకే వెళ్లే ప్రయాణికులకు 10 రోజులు నిర్భంధ క్వారంటైన్ విధిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news